పాతికేళ్ల క్రితం కథతో...

12 Dec, 2016 14:49 IST|Sakshi
 ‘‘ఓ వాస్తవ సంఘటన నేపథ్యంలో మా చిత్రం సాగుతుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. కొంత నక్సలిజాన్ని కూడా టచ్ చేశాం. ప్రేమ, వినోదం, యాక్షన్ అన్నీ ఉంటాయి. నారా రోహిత్ సపోర్ట్‌తోనే సినిమాని అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం’’ అని దర్శకుడు సాగర్ కె.చంద్ర తెలిపారు. నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో సాగర్ దర్శకత్వంలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. 
 
 సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తా. కొత్త తరహా కథతో తెరకెక్కిన చిత్రమిది. నా కెరీర్‌లో ఒక మంచి చిత్రంగా నిలుస్తుంది. సాయికార్తీక్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంటాయి’’ అన్నారు. ‘‘ఈ తరహా చిత్రంలో నేను నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం విజయం సాధిస్తే మరికొన్ని కొత్త చిత్రాలు వస్తాయి’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. శ్రీవిష్ణు, తాన్యా హోప్, నటులు సత్య, అజయ్, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నవీన్ యాదవ్. 
 
>