పాటల సందడి

30 Nov, 2019 06:01 IST|Sakshi
తనిష్క్‌

సుజన్, తనిష్క్‌ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు ఇప్పుడు’. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ఓ పాటని హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్‌ గుడ్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ చిత్రమిది. కళ్యాణ్‌ సమి విజువల్స్, పద్మనావ్‌  భరద్వాజ్‌ సంగీతం మా సినిమాకి హైలెట్‌’’ అన్నారు. ‘‘కె.విశ్వనాథ్‌గారి విడుదల చేసిన మొదటి పాటకు, కె.రాఘవేంద్రరావుగారు విడుదల చేసిన మరో పాటకి మంచి స్పందన వచ్చింది. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌గారు విడుదల చేసిన టీజర్‌కి సూపర్‌ రెస్పాన్స్‌ రావడంతో ట్రేడ్‌ వర్గాల్లో మా సినిమా మీద బజ్‌ పెరిగింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు.

మరిన్ని వార్తలు