ఈ స్టార్‌ హీరోను కొత్తగా చూపించాలనుకున్నా’

29 Dec, 2019 09:10 IST|Sakshi

రాజకీయాలకనుగుణంగా దర్బార్‌ చిత్రంలో రజనీకాంత్‌ పాత్రను రూపొందించలేదని ఈ చిత్ర దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ పేర్కొన్నా రు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దర్బార్‌ ఫీవర్‌ నడు స్తోంది. ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించిన చర్చే. అందుకు కారణం చిత్ర కథానాయకుడు సూపర్‌స్టార్‌ కావడమే. దీనికి దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రం దర్బార్‌ కావడం ఈ క్రేజ్‌కు మరో కారణం. ఇక అగ్రనటి నయనతార నాలుగోసారి రజనీకాంత్‌తో జత కట్టడం, యువ సంగీతతెరంగం అనిరుద్‌ సంగీతాన్ని అందించడం, లైకా సంస్థ రాజీలేని నిర్మాణం వెరసి దర్బార్‌ అంచనాలను పైపైకి పెంచేస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే సుమారు 10 ఏళ్ల తరువాత రజనీకాంత్‌ పోలీస్‌ అధికారిగా నటించడం కూడా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రజనీ దర్బార్‌ 2020 జనవరి 9వ తేదీన ఒక ప్రభంజనం సృష్టించడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ శనివారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని లైకా సంస్థ కార్యాలయంలో మీడియాను కలిశారు. 

దర్బార్‌ అంటే? 
దర్బార్‌ అంటే రూలింగ్‌ చేసే స్థలం అనవచ్చు.

దర్బార్‌ చిత్రం గురించి చెప్పండి? 
చిత్ర కథ గురించి ఇప్పుడే రివీల్‌ చేయలేను గా నీ, ఇది పూర్తిగా ముంబైలో చిత్రీకరించిన చిత్రం. రజనీకాంత్‌ పోలీస్‌కమిషనర్‌గా నటించారు. 

ఈ చిత్ర కథకు ఎక్కడ బీజం పడింది? 
ఒకసారి రజనీకాంత్‌ను కలవడానికి కారులో వెళుతున్నాం. నిర్మాత థానునే రజనీకాంత్‌కు నన్ను పరిచయం చేశారు. అలా కారులో పయనిస్తుండగానే కథ గురించి ఆలోచించాను. రజనీకాంత్‌ గత పదేళ్లుగా చేస్తున్నవేంటి? చేయని విషయాలు ఏంటి. అన్న దాని గురించి బేరీజు వేసుకున్నాను. రజనీకాంత్‌ను ప్రస్తుతం చేస్తున్న చిత్రాలకు భిన్నంగా చూపించాలన్న విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యాను. పదేళ్లుగా ఆయన నటించిన చిత్రాలకు భిన్నంగా, కొత్తగా రజనీకాంత్‌ను చూపించాలనుకున్నాను.

అలాగని కోట్లకు పడగలెత్తిన రజనీకాంత్‌ మోసానికి గురై ఆస్తులు పోగొట్టుకుని తిరిగి సంపాందించుకోవడం లాంటి కథను, డాన్‌ ఇతివృత్తంతో కూడిన కథను ఆయనతో చేయాలనిపించలేదు. మరో విషయం ఏమిటంటే తుపాకీ చిత్రం షూటింగ్‌ సమయంలో మిలటరీ నేపథ్యంలో చిత్రం చేస్తే, హర్బర్‌లో షూటింగ్‌ చేస్తే ఆ చిత్రాలు ఆడవు అని అర్థం చేసుకున్నాను. అలాంటి ఆలోచనలోంచి పుట్టిందే పోలీస్‌అధికారి పాత్ర. రజనీకాంత్‌ను కలిసినప్పుడు యూండ్రుముఖం చిత్రంలో అలెక్స్‌ పాండియన్‌ను పూర్తి స్థాయిలో చూపించాలనుకుంటున్నట్లు చెప్పారు. అది విన్న ఆయన బాగుంది చేద్దాం అని చెప్పారు. 

రజనీకాంత్‌ను పోలీస్‌ గెటప్‌లో మీసం, గెడ్డంతో చూపించడానికి కారణం? 
నిజానికి పోలీసులకు గడ్డం ఉండదు. అలా ఉండాలంటే రీజన్‌ ఉండాలి. గెడ్డం లేకపోతే ముఖానికి అలెర్జీ వస్తుందనో, ఏదైనా మొక్కుబడి లాంటి రీజన్లతో పై అధికారి వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఒక పోలీస్‌అధికారి సూచనలను తీసుకున్నాం. అలా ఒక రీజన్‌తో దర్బార్‌ చిత్రంలో రజనీకాంత్‌కు గడ్డెం, మీసం పెట్టాం. 

మహిళల రక్షణ గురించి ఏమైనా చెప్పారా? 
అలాంటి చిన్న చిన్న అంశాలు ఉంటాయి. అవి రియలిస్టిక్‌గా ఉంటాయి. నిజానికి మహిళా రక్షణ చట్టాలు ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో చాలా బాగా అమలవుతున్నాయి. తమిళనాడులో కూడా అలాంటి చట్టాలు అమలయితే బాగుంటుంది. 

దర్బార్‌ చిత్ర ట్రైయిలర్‌ చూస్తుంటే రక్తపాతం అధికంగా ఉన్నట్లు తెలుస్తోందే? 
దీన్ని పాన్‌ ఇండియా చిత్రంగా ఉండాలని భా వించాం. తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ రూపొందించ తలపెట్టాం. బాలీవుడ్‌ చిత్రా ల్లో కాస్త వైలెన్స్‌ అధికంగా ఉంటేనే అక్కడ ప్రేక్షకులు చూస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫాన్‌ ఇండియా చిత్రంగా దర్బార్‌ను తెరకెక్కించాం. 

ఈ చిత్ర షూటింగ్‌లో రజనీకాంత్‌ను చాలా దగ్గరుండి చూశారు. ఆయన గురించి? 
రజనీకాంత్‌ చాలా ఆశ్యర్యకరమైన వ్యక్తి. షూ టింగ్‌ ముగిసిన తరువాత ఆయన్ని చూడడానికి వేలాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటా రు. ఒక సూపర్‌స్టార్, త్వరలో రాజకీయరంగ ప్ర వేశం చేయబోతున్న వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రజనీకాంత్‌ అలాంటివేవీ లేకుండా చాలా సహజంగా అందరిని పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగుతూ ఎంతో నిరాడంబరతను ప్రదర్శిస్తారు. అంతే కాదు నేను ఏ ప్రశ్ర అడిగినా, అది వ్యక్తిగతం అయినా, రాజకీయపరమైనదైనా, ఆధ్యాత్మికపరమై నది అయినా అన్నింటికీ బదులిచ్చేవారు. ముఖ్యంగా నటనపై ఆయనకు ఉన్న తపన నన్ను ఎంతగానో ఆశ్చర్యచకితుడిని చేసింది. ప్రతి సన్నివేశం గురించి బాగుందా? అని అడుగుతారు. అంత డెడికేషన్స్‌ ఈ తరం నటుల్లో చాలా తక్కువే ఉంటుంది. 

రజనీకాంత్‌ త్వరలో రాజకీయరంగప్రవేశం చేయనున్నారు.ఈ చిత్రం ఆయన రాజకీయాలకు ఎంత వరకూ ఉపయోగపడుతుంది? 
నిజం చెప్పాలంటే రజనీకాంత్‌ రాజకీయాలకు ఉ పయోగపడేలా దర్బార్‌ చిత్ర కథను తయారు చేయలేదు. అలాంటి వాటిని అవైడ్‌ చేశాం. అయితే చిత్రంలో చిన్న చిన్న సన్నివేశాలు అలాంటివి ఉంటాయి. 

ఎంజీఆర్‌ రాజకీయ రంగప్రవేశానికి ముందు ఉలగం చుట్రుం వాలిబర్‌ చిత్రం చేశారు. ఆ చిత్రం ఆయన రాజకీయా రంగప్రవేశానికి తోడ్పడింది? 
నిజమే. అయితే ఎంజీఆర్‌ నటించిన ఉలగం చుట్రుం వాలిబర్‌ చిత్రం వేరు. రజనీకాంత్‌ నటించిన దర్బార్‌ చిత్ర కథ వేరు. ఎంజీఆర్‌ ఉలగం చుట్రుం వాలిబర్‌ జేమ్స్‌బాండ్‌ తరహా కథతో కూడినది. దర్బార్‌ ఒక పవర్‌ఫుల్‌  పోలీస్‌అధికారి ఇతి వృత్తంతో కూడిన చిత్రం. రజనీకాంత్‌ ఆలోచనలు చాలా యంగ్‌గా ఉంటాయి. ఆయనలో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. 40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారు. 

రజనీ రాజకీయ ప్రవేశం గురించి? 
ఆయన  రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పేటంతటి వాడిని కాదు. అయితే ఆయనలో ప్రజలకు మంచి చేయాలన్న తపన మాత్రం ఉంది.  

చదవండి: 
అమితాబ్‌ సూచనను పాటించలేకపోతున్నా
ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించాలని ఉంది

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా