ఆ చిత్రం క్రేజే వేరు అని చెప్పనక్కర్లేదు

13 Aug, 2017 18:50 IST|Sakshi
ఆ చిత్రం క్రేజే వేరు అని చెప్పనక్కర్లేదు

కోలీవుడ్లో సంగీత పయనాన్ని ప్రారంభించిన ఏఆర్. రెహ్మాన్ ఆ తరువాత టాలీవుడ్, బాలీవుడ్లను దాటి హాలీవుడ్ చిత్రాలకు తన సంగీత మాధుర్యాన్ని అందించే స్థాయికి ఎదిగారు. ఆంగ్ల చిత్రం స్లమ్డాగ్తో ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఆ సంగీత మాంత్రికుడు మరోసారి అంతర్జాతీయ స్థాయి చిత్రానికి సంగీతం అందించడానికి రెడీ అయ్యారన్నది తాజా సమాచారం. ఏఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారంటే ఆ చిత్రం క్రేజే వేరు అని చెప్పనక్కర్లేదు.

కరాటే కింగ్ బ్రూస్లీ పేరు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ సజీవం అని వేరే చెప్పక్కర్లేదు. సినిమాల్లో ఏ నటుడు చేయనటువంటి సాహసాలు బ్రూస్లీ చేశాడు. అలాంటి బ్రూస్లీ జీవిత చరిత్ర వెండి తెరకెక్కుతోంది. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు, నటుడు శేఖర్కపూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే సాహసం చేస్తున్నారు. ఆ బ్రహ్మాండ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారట.

ఈ విషయాన్ని ఇటీవల ఒక భేటీలో శేఖర్కపూర్ స్వయంగా వెల్లడించారు. ఆ చిత్రానికి లిటిల్డ్రాగన్ అనే టైటిల్ను నిర్ణయించారు. సంగీతంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన ఏఆర్. రెహ్మాన్ సినీ కేరీర్లో ఈ లిటిల్ డ్రాగన్ చిత్రం మరో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి