రెహమాన్ కొత్త ఆల్బమ్‌ 'ది ఫ్లయింగ్‌ లోటస్‌'

22 Oct, 2017 10:12 IST|Sakshi

ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ ది ఫ్లయింగ్‌ లోటస్‌ పేరుతో కొత్త ఆల్బం ను అందుబాటులోకి తెచ్చారు. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సీటెల్‌ సింఫోనీ ఆర్కెస్ట్రా మ్యూజిక్‌ కంపోజిషన్ లో రెహమాన్  కొత్త ఆల్చమ్‌ తెచ్చారు. రిచార్డో ఆవేర్బాచ్‌ మార్గదర్శకత్వంలో రెహమాన్ పాడిన 19 నిమిషాల వ్యవధి కలిగిన ఈ పాట సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయనుందని, ప్రధాని నరేంద్రమోదీ గొంతుతో పెద్దనోట్లు రద్దు అంటూ ప్రకటించిన పదాలు  ఈ ఆల్బమ్‌లో చోటుచేసుకోవడం ప్రత్యేకత.

ఈ సందర్భంగా యూనివర్శిల్‌ మ్యూజిక్‌ గ్రూప్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా సీఈవో దేవరాజ్‌ సన్యాల్‌ మాట్లాడుతూ యూనివర్శల్‌ సంస్థ ఏఆర్‌ రెహమాన్ తో కలసి ఇటీవల విడుదల చేసిన ఈ ది ఫ్లయింగ్‌ లోటస్‌ ఆల్బమ్‌ కొత్తగా ఉందని, అందరిని సంగీత మాయాజాలంలోకి నెడుతుందని ఆయన  ఈ రోజు ప్రకటనలో పేర్కొన్నారు.

రెహమాన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రకటన దేశంలో అతిపెద్ద చారిత్రాత్మక ప్రకటన అని అన్నారు. దీనిని స్వాగతించిన వారు, వ్యతిరేకించిన వారు ఉన్నప్పటికీ పాట రూపంలో నమోదు చేసేందుకు సంగీతమాధ్యమాన్ని ఉపయోగించామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యూనివర్శల్‌ మ్యూజిక్‌ గ్రూప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు