ఫోటోతో సమాధానం చెప్పిన రెహమాన్‌

9 Feb, 2019 15:57 IST|Sakshi

బుర్ఖా వివాదం అనంతరం సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. 24 గంటల్లోపే ఈ ఫోటోను దాదాపు 2 లక్షల మంది లైక్‌ చేశారు. ‘హలో ఇండియా మ్యాగజైన్‌’ ఫోటో షూట్‌ సందర్భంగా తీసిన ఈ ఫోటోలో రెహమాన్‌ పిల్లలు ఖతీజా, రహిమా, అమీన్‌ ముగ్గురు ఉన్నారు. అయితే ఈ ఫోటోలో కూడా ఖతీజా బుర్ఖా ధరించే ఉన్నారు. అమీన్‌, రహీమ మాత్రం మోడ్రన్‌ దుస్తులు ధరించి ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. రెహమాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఒక్క ఫోటోతో విమర్శించే వాళ్ల నోళ్లు మూయించారంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

Raheema ,Khatija and Ameen posing for Hello magazine 😊

A post shared by @ arrahman on

రెహమాన్‌ ఆస్కార్‌ అవార్డు సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఖతీజా బుర్ఖాలో రావడంతో కొంతమంది విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. రెహమాన్‌ సంకుచిత స్వభావం కలవాడని, బుర్ఖా ధరించాలని కూతురిపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. వీటిపై స్పందించిన ఖతీజా.. వ్యక్తిగత స్వేచ్ఛను తన తల్లిదండ్రులు గౌరవిస్తారని తెలిపారు. బుర్ఖా ధరించడాన్ని తాను గౌరవంగా భావిస్తానని ఖతీజా వెల్లడించారు.

మరిన్ని వార్తలు