కొత్తగా...

1 Feb, 2015 00:23 IST|Sakshi
కొత్తగా...

 ‘7/జి బృందావన కాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్, అర్చన నటించిన చిత్రం ‘తరువాత కథ’. వినోద్‌కుమార్, రవిప్రకాశ్, శివాజీ రాజా ఇతర  ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి ప్రభాకరన్ దర్శకుడు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని చిత్రనిర్మాత ఆర్. పద్మజ చెబుతూ -‘‘ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ప్రతి సన్ని వేశం కొత్తగా ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరి తంగా సాగుతుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: ఉదయ్‌భాస్కర్ జాస్తి.