భారత హీరోయిన్‌కు మరో హాలీవుడ్ చాన్స్‌!

30 Jan, 2016 11:04 IST|Sakshi
భారత హీరోయిన్‌కు మరో హాలీవుడ్ చాన్స్‌!

లాస్‌ ఏంజిల్స్: భారత సంతతికి చెందిన బ్రిటిషన్ నటి ఆర్చీ పంజాబీ మరో హాలీవుడ్ సినిమాలో మెరువనుంది. ఇప్పటికే 'ద గుడ్ వైఫ్‌' సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులను పలుకరించిన ఈ అమ్మడు.. తాజాగా ఏబీసీ అంతాలజీ 'జ్యూరీ'లో నటించనుంది. ఈ సినిమాలో కిమ్‌ డింప్సేగా ప్రధాన పాత్రలో నటించనుంది. ఓ హత్య ఘటన విచారణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

వ్యక్తిగత అనుభవాలు, పక్షపాతాలు న్యాయమూర్తుల తీర్పులను ఎలా ప్రభావితం చేస్తాయి.. కాలక్రమంలో అభిప్రాయాలు ఎలా మారుతాయా? అన్న అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. వృత్తిరీత్యా ఎవరితో స్నేహంగా ఉండకుండా సత్యాన్వేషణలో నిమగ్నమయ్యే గంభీరమైన పాత్రను పంజాబీ పోషిస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. వీజే బొయ్‌డ్‌ స్క్రిప్ట్ అందిస్తున్న ఈ సినిమాను ఏబీసీ స్టూడియో, సోని పిక్చర్స్ టెలివిజన్ సహ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించనున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి