ముఖం చాటేసిన యంగ్‌ హీరో!

24 Nov, 2018 19:50 IST|Sakshi

అర్జున్‌ కపూర్, మలైకా అరోరా పెళ్లి అంటూ గత కొద్దీ రోజులుగా బాలీవుడ్‌ కోడై కూస్తోంది. ఈ వార్తలను బలపరిచేలా ఈ జోడి సైతం బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ పార్టీకి ఫిల్మ్‌మేకర్‌ కరణ్‌ జోహర్‌తో కలసి హాజరైన ఈ జోడీ ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ పార్టీకి కరణ్‌ జోహర్‌తో పాటు సంజయ్‌కపూర్‌, మహీప్‌ కపూర్‌లు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక కరణ్‌ జోహర్‌ మలైక అరోరాలు ఫొటోలకు ఫోజివ్వగా.. అర్జున్‌ కపూర్‌ మాత్రం మాస్క్‌తో ముఖం కనిపించకుండా ఫొటోగ్రాఫర్‌లకు దూరంగా వెళ్లాడు. తన అప్‌కమింగ్‌ చిత్రం పానిపట్‌ కోసమే అర్జున్‌ తన ముఖాన్ని కవర్‌ చేసుకున్నాడని, ఈ సినిమా లుక్‌ను రివీల్‌ చేయవద్దనే అలా చేశాడని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ పార్టీకి  రూ. 90వేల షూస్‌తో మలైకా అరోరా వచ్చినట్లు మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది. 

వాస్తవానికి ప్రస్తుతం బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. అక్కడి టాప్‌ హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, దీపికా పడుకొనె పెళ్లి వార్తలతో బిజీగా ఉన్నారు. వారి సరసన మలైకా అరోరా చేరడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. కారణం మలైకా వయసు 45. అర్జున్‌ కపూర్‌ వయసు 33. మలైకా గతంలో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అతని వల్ల ఆమెకు 15 ఏళ్ల అర్హాన్‌ ఖాన్‌ అనే కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల నుంచే మలైకా– అర్బాజ్‌ విడిగా ఉంటున్నా గత ఏడాదే చట్టబద్ధంగా విడాకులు పొందారు. పలు ఇంటర్వ్యూల్లో పెళ్లి రూమర్స్‌పై మలైకా అరోరాను ప్రశ్నించగా.. వ్యక్తిగత ప్రశ్నలకు ఎప్పుడూ సమాధానాలు చెప్పనని దాటవేశారు.

#mallaikaarorakhan #arjunkapoor #maheepkapoor #sanjaykapoor and #karanjohar snapped in Juhu @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా