అనుష్కను ఆటపట్టించిన హీరో!

16 Jan, 2020 12:35 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ సహ నటులను ఆటపట్టించడంలో ఎప్పుడూ ముందుంటాడు. బాలీవుడ్‌ నటీనటులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే పోస్టులను ట్రోల్‌ చేస్తూ సరదాగా ఆటపట్టిస్తుంటాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో కామెంట్ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఈ హీరో ట్రోల్స్‌కు.. గతంలో శ్రద్ద కపూర్‌, కత్రినా కైఫ్‌, దీపికాలు చిక్కారు. ఇక అర్జున్‌ ట్రోల్స్‌కు పాపం ఈ సారి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ దొరికారు. అనుష్క తన ఇంట్లో బాల్కని వద్ద ఎండలో కుర్చుని టీ తాగుతున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేస్తూ.. ‘అలా సూర్యకిరణాల కింద టీ తాగుత్ను ఈ సన్నివేశం ఙ్ఞాపకంగా మిగిలిపోతుంది. నాకు ప్రియమైన వ్యక్తి ఈ ఫొటో తీశాడు’  అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. ఈ ఫొటోలో అనుష్క టీ షర్ట్‌, జాగర్‌ను ధరించి చేతిలో టీ కప్‌.. కాళ్లకు సాక్స్‌లు ధరించి ఉన్నారు. ఇక అనుష్క పోస్టు చూసిన అర్జున్‌ తనదైన శైలిలో..  ‘సాక్స్‌ డ్రై వాష్‌ చేశావ్‌ మరి.. టాప్‌ చేశావా?’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇక అర్జున్‌ కామెంట్‌కు అనుష్క సైతం.. ‘బాస్‌ మనం సాక్స్‌ ఉతికేస్తామా’ అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. 

And just like that a coffee under the setting sun on the balcony of our home became a memory to hold ♥️ Captured by my beloved 👩‍❤️‍👨

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు