హర్భజన్‌ ‘ఫ్రెండ్‌ షిప్‌’లో అర్జున్‌

19 Feb, 2020 11:08 IST|Sakshi

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. నయా ఇన్నింగ్స్‌లో భజ్జీ హీరోగా అవతారమెత్తనున్నారు. జాన్‌ పాల్‌ రాజ్‌, శ్యామ్‌ సూర్యల సంయుక్త దర్శకత్వంలో హర్భజన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫ్రెండ్‌షిప్‌’ . తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌ మరియనేసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జేపీఆర్‌, స్టాలిన్‌లు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను చిత్ర బృందం తెలియజేసింది. 

ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర చేయడానికి యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ అంగీకరించారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అర్జున్‌తో పాటు తమిళ నటుడు సతీష్‌ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారు. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో పలు భారతీయ భాషల్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.   

మరిన్ని వార్తలు