హిందీ ‘అర్జున్‌ రెడ్డి’కి సిద్ధం

12 May, 2018 11:21 IST|Sakshi

గత ఏడాది సంచలన విజయం సాధించిన యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అర్జున్‌ రెడ్డి. సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ సెన్సేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు. ఎన్నో వివాదాల మధ్య వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషల్లో రీమేక్‌ చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.

తమిళ్‌లో ఈ సినిమాతో చియాన్‌ విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాల దర్శకత్వంలో తమిళ రీమేక్‌ రూపొందుతోంది. తాజాగా హిందీ రీమేక్‌ పనులు కూడా ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఒరిజినల్‌ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి బాలీవుడ్‌ అర్జున్‌ రెడ్డికి దర్శకత్వం వహించనున్నాడు. యంగ్ హీరో షాహిద్ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మురద్‌ ఖేతాని, అశ్విన్‌ వర్దేలు నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు