బాలా అవుట్‌.. గౌతమ్‌ ఇన్‌!

10 Feb, 2019 00:49 IST|Sakshi

‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌ ‘వర్మ’ అవుట్‌పుట్‌ నచ్చలేదని సినిమాను మళ్లీ షూట్‌ చేస్తున్నాం అని నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి తమిళ పరిశ్రమ షాక్‌ అయింది. హీరో ధృవ్‌ మినహా మిగతా టీమ్‌ను మార్చి రీషూట్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు సంస్థ అధినేతలు. దాంతో దర్శకుడు బాలా స్థానంలో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారన్నది కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది. ఈ ప్రాజెక్ట్‌ను గౌతమ్‌ మీనన్‌ చేపట్టనున్నారట. ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ చేసిన ‘ధృవనక్షత్రం’ రిలీజ్‌కి రెడీ అయింది. ఇప్పుడు ‘వర్మ’ సినిమా చేస్తే తండ్రీ–కొడుకులతో గౌతమ్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసినట్లు అవుతుంది. 

మరిన్ని వార్తలు