ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం కేరాఫ్‌ అర్జున్‌ సురవరం

6 Dec, 2019 09:04 IST|Sakshi

నగరంలో సినీసందడి నెలకొంది. అర్జున్‌ సురవరం చిత్ర యూనిట్‌ విజయ యాత్రలో భాగంగా శ్రీకృష్ణా థియేటర్‌కు ఆ చిత్ర హీరో నిఖిల్, క్యారెక్టర్‌ నటుడు నాగినీడు, దర్శకుడు చేరుకుని కాసేపు ప్రేక్షకులను అలరించారు. వారితో మాట్లాడి సినిమా విశేషాలు పంచుకున్నారు. అనంతరం హీరో నిఖిల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం ఈ చిత్రం ప్రత్యేకతని తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలవల్ల ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారని... దానిపైనే తమ కథనం సాగిందని వివరించారు. 

ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం అంటే ఏమిటో అర్జున్‌ సురవరం సినిమా ద్వారా తెలియజేశామని ఆ చిత్ర హీరో నిఖిల్‌ తెలిపారు. విజయయాత్రలో భాగంగా ఆ చిత్ర యూనిట్‌ నగరంలోని కృష్ణా థియేటర్‌కు గురువారం మధ్యాహ్నం వచ్చింది. తొలుత థియేటర్‌లో ప్రేక్షకులతో కాసేపు మాట్లాడి, వారిని పలకరించి... వారితో సెల్ఫీలు దిగిన అనంతరం విలేకరులతో హీరో నిఖిల్‌ మాట్లాడుతూ నకిలీ విద్యార్హత ధ్రువపత్రాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయని చెప్పడం ఈ సినిమా ఉద్దేశమన్నారు. జర్నలిస్టుగా నటించేందుకు కొన్నాళ్లపాటు జర్నలిస్టుల పనితీరును కూడా పరిశీలించినట్లు తెలిపారు. విజయనగరంలో ఇంతటి భారీస్ధాయిలో ప్రజల నుంచి రెస్పాన్స్‌ వస్తుందని అసలు ఊహించలేదన్నారు. కేరెక్టర్‌ ఆర్టిస్టు నాగినీడు మాట్లాడుతూ మంచి సందేశం ఉన్న చిత్రాలను ప్రతీ ఒక్కరూ ఆదరిస్తారని మరో మారు రుజువైందన్నారు. చిత్ర దర్శకుడు టి.ఎన్‌.సంతోష్‌ నటులు విద్యులేఖా రామన్‌ మాట్లాడుతూ తెలుగులో తమ తొలి సినిమాకు ఇంత విజయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.  

మరిన్ని వార్తలు