శంకర్ 'ఐ' ఆడియో ఫంక్షన్కు హాలీవుడ్ హీరో

6 Sep, 2014 18:13 IST|Sakshi
శంకర్ 'ఐ' ఆడియో ఫంక్షన్కు హాలీవుడ్ హీరో

చెన్నై: సంచలన తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం 'ఐ' ఆడియో పంక్షన్కు హాలీవుడ్ యాక్షన్ స్టార్ ఆర్నాల్డ్ ష్క్వార్జ్నెగ్గర్ వస్తున్నారు.  చెన్నైలో ఈ నెల 15న జరిగే ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ష్క్వార్జ్నెగ్గర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 32 సెకెన్ల నిడివిగల యూ టూబ్ వీడియోలో తన అభిమానులనుద్దేశించి మాట్లాడారు.

'అద్భుతమైన చిత్రాన్ని తీసిన గొప్ప దర్శకుడు శంకర్కు నా అభినందనలు. ఐ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటున్నా. ఈ ఈవెంట్ విజయవంతమవుతుంది' అని ష్క్వార్జ్ నెగ్గర్ అన్నారు. విక్రమ్ హీరోగా నటించిన ఐ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్వరాలందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మనోహరుడు పేరుతో విడుదల చేస్తున్నారు.

>