పెంపుడు గాడిదతో ఆర్నాల్డ్‌ కసరత్తులు

31 May, 2020 12:28 IST|Sakshi
లులుతో ఆర్నాల్డ్‌

72 ఏళ్ల వయసులోనూ హాలీవుడ్‌ యాక్షన్‌ హీరోగా అదరగొడుతున్నారు కండల వీరుడు ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌‌నెగ్గర్‌. బహుశా ఆయన తన శరీరంపై తగిన శ్రద్ధ చూపించటమే ఇందుకు కారణమై ఉండొచ్చు. లాక్‌డౌన్‌లోనూ ఆయన జిమ్‌కు వెళ్లటం మాత్రం మానలేదు. తాజాగా ఆయన తన పెంపుడు గాడిద లులుతో జిమ్‌లో కసరత్తులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘లులు కసరత్తులు చేస్తోంది’ అనే శీర్షికను ఉంచారు. ఆ వీడియోలో.. ఆర్నాల్డ్‌తో పాటు ఎంతో ఉత్సహంతో హోమ్‌ జిమ్‌లోని అడుగు పెట్టిన లులు ఆయన చేస్తున్న పనిని ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉండిపోయింది. జిమ్‌ మొత్తం కలియతిరిగి సందడి చేసింది. ( కాలిపోనివ్వండి, కానీ న్యాయం జరగాలి)

కాగా, సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆర్నాల్డ్‌ తమ కుంటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటుంటారు. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ క్యాథెరీన్(కూతురు)‌ తల్లి కోబోతున్న విషయం నాకెంతో ఎగ్జైటింగా ఉంది. మనవడో, మనవరాలో ఎవరో తెలియదు కానీ, పుట్టబోయే చిన్నారితో ఆడుకోవటానికి ఎదురుచూస్తున్నాను. నాక్కొంచెం సరదాగా ఉంటుంది’’ అని అన్నారు.

చదవండి  : ష్వార్జ్‌నెగ్గర్‌ స్ఫూర్తిదాత మృతి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు