డోంట్‌ వర్రీ కేరళ

21 Aug, 2018 00:17 IST|Sakshi
ఏఆర్‌ రెహమాన్‌

‘ముస్తఫా ముస్తఫా డోంట్‌ వర్రీ ముస్తఫా.. కాలం మన నేస్తం ముస్తఫా’ అంటూ ఏఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. ‘ప్రేమ దేశం’ సినిమాలోని ఈ పాట అంటే అప్పటి యూత్‌కే కాదు.. ఇప్పటి యూత్‌కీ క్రేజ్‌. ఇంకా చెప్పాలంటే ‘ఫ్రెండ్‌షిప్‌’ అంటే ఈ పాటే చాలామందికి గుర్తొస్తుంది. కేరళ కోసం ఈ క్రేజీ సాంగ్‌ లిరిక్‌ని మార్చి పాడారు ఏఆర్‌ రెహమాన్‌.

రీసెంట్‌గా కాలిఫోర్నియాలో షో చేశారాయన. ఎంత దూరం వెళ్లినా సొంత దేశాన్ని మరచిపోరు కదా. ఆ ఈవెంట్‌ చేస్తున్నప్పుడు రెహమాన్‌కి వరదల కారణంగా దుస్థితిలో ఉన్న కేరళ గుర్తొచ్చింది. అంతే.. ‘కేరళా.. కేరళా.. డోంట్‌ వర్రీ కేరళా. కాలం మన నేస్తం కేరళా’ అని పాడగానే, ఆ ప్రాంగణమంతా చప్పట్లో మార్మోగింది. అందరూ తమ ప్రేయర్స్‌ను ఒక్కోలా పంపుతుంటే రెహమాన్‌ పాట ద్వారా తన సందేశం పంపారు.

మరిన్ని వార్తలు