కళా దర్శకుడు రవీందర్‌కు అరుదైన పురస్కారం

13 Aug, 2013 01:22 IST|Sakshi
కళా దర్శకుడు రవీందర్‌కు అరుదైన పురస్కారం
సినీ పరిశ్రమలో కళాదర్శకునిగా రవీందర్ స్థానం ప్రత్యేకం. ఛత్రపతి, మగధీర, మర్యాదరామన్న, ఈగ, రాజన్న, జులాయి చిత్రాలకు కళా దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలందుకున్నారాయన. 
 
 కళాదర్శకునిగా ఇప్పటికి మూడుసార్లు నంది పురస్కారాలు అందుకున్న రవీందర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి మెరవనుంది. ‘ఈగ’ చిత్రం కోసం రవీందర్ వేసిన విలన్ హౌస్ సెట్, మైక్రో ఆర్ట్ వర్క్‌కు గాను బ్రెజిల్ చలనచిత్రోత్సవంలో ‘ఉత్తమ కళా దర్శకుడు’ పురస్కారానికి రవీందర్ ఎంపికయ్యారు. 
 
 ఈ చలనచిత్రోత్సవంలో పురస్కారం అందుకోబోతున్న తొలి తెలుగు సినీ సాంకేతిక నిపుణుడు రవీందరే కావడం విశేషం. పవన్‌కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రానిక్కూడా రవీందరే కళా దర్శకుడు. పలు బాలీవుడ్ చిత్రాలక్కూడా పనిచేస్తున్నారాయన.