చరణ్‌కు అన్నయ్యగా కమెడియన్‌

19 Feb, 2018 08:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రామ్‌చరణ్‌ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో రంగస్థలం ఇటీవలే పూర్తి చేసుకున్న చరణ్‌, ఆతర్వాత  మాస్ అభిమానుల పల్స్‌ తెలిసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా పూర్తి అయింది. ఈ సినిమాలో ఇప్పటికే పలువురు టాప్‌ నటీనటులు నటిస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్‌ స్నేహ, తమిళ హీరో ప్రశాంత్‌లు కీలక పాత్రలో కనిపించనున్నారు. 

తాజాగా ఈసినిమాపై మరో వార్త టాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. ఈవీవీ సత్యనారాయణ పెద్ద తనయుడు ఆర్యన్‌ రాజేష్‌ నటిస్తున్నట్లు సమాచారం. చరణ్‌కు అన్నయ్యగా కనిపించనున్నాడట. ఆర్యన్‌కు జోడీగా జర్నీ సినిమా ఫేం అనన్య కూడా నటిస్తోందట. రాజేష్‌ సొంతం, హాయ్‌ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌కు ఏర్పాట్లు చేసుకుంటోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు