అన్న కాదు విలన్‌..!

4 Aug, 2018 10:42 IST|Sakshi

రంగస్థలం సినిమా తరువాత మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వివేక్‌తో పాటు మరో విలన్‌ కూడా కనిపించనున్నాడట. హాయ్‌ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన ఆర్యన్ రాజేష్‌,  చెర్రీ సినిమాలో స్టైలిష్ విలన్‌గా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే జగపతి బాబు, ఆది పినిశెట్టి లాంటి వాళ్లను విలన్‌లుగా చూపించి మెప్పించిన బోయపాటి, రామ్‌చరణ్‌ సినిమాతో ఆర్యన్ రాజేష్‌ను ప్రతినాయక పాత్రలో పరిచయం చేయనున్నాడు. ముందుగా ఈ సినిమాలో ఆర్యన్‌, చెర్రీకి అన్నగా కనిపించనున్నారన్న ప్రచారం జరిగింది. కానీ తాజా సమచారం ప్రకారం ఈ సీనియర్‌ హీరో నెగెటివ్‌ రోల్‌ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆర్యన్ రాజేష్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.   మరి ఈ సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో ఏ రాజేష్ కూడా జగపతి బాబు, ఆదిల్లా స్టార్ ఇమేజ్‌ అందుకుంటాడేమో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు