ఆద్యంతం ఆసక్తికరం...

14 Sep, 2014 00:17 IST|Sakshi
ఆద్యంతం ఆసక్తికరం...

 షేక్ సైదా సూరజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పాషా అందరివాడు’. బండారు దానయ్యకవి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో ఇటీవల విడుదల చేశారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. దానయ్యకవి అద్భుతమైన సంగీతం అందించారని, సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని సైదా సూరజ్ అన్నారు. సంగీత దర్శకునిగా ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని బండారు దానయ్యకవి విశ్వాసం వెలిబుచ్చారు. చంద్రమోహన్, పి.ప్రభాకర్, చిన్నా తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: కాంచనపల్లి రాజేంద్రరాజు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి