యశ్‌ చోప్రా అవార్డు అందుకున్న ఆశా

18 Feb, 2018 00:45 IST|Sakshi
ఆశా భోంస్లే, విద్యాసాగర్‌ రావు, టి.సుబ్బ్బరామిరెడ్డి, రేఖ

లెజండరీ సింగర్‌ ఆశా భోంస్లేకు ప్రతిష్టాత్మక యశ్‌ చోప్రా మెమోరియల్‌ అవార్డును టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్‌ శుక్రవారం ముంబైలో ప్రదానం చేసింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆశా భోంస్లే 20 భాషల్లో దాదాపుగా 11వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకు యశ్‌ చోప్రా అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు టీయస్సార్‌.

ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, నటి జయప్రద, బాలీవుడ్‌ నటి రేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా భోంస్లేకు రేఖ అభినందనలు తెలిపి, పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2012లో చనిపోయిన యశ్‌ చోప్రా జ్ఙాపకార్థం టి. సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్‌లు నెలకొల్పిన ఈ అవార్డును ఇదివరకు లతా మంగేష్కర్, అమితాబ్‌ బచ్చన్, రేఖ, షారుక్‌ ఖాన్‌ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా అందజేస్తారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

సినిమా

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!