చైనాకు అసురన్‌

12 Jun, 2020 05:51 IST|Sakshi

చైనా థియేటర్స్‌లో ‘అసురన్‌’ కనిపించబోతున్నాడు. ధనుష్‌ హీరోగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అసురన్‌’. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌ సాధించింది. ఈ చిత్రం తెలుగులో ‘నారప్ప’గా రీమేక్‌ అవుతోంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్నారు. ‘అసురన్‌’ చిత్రం కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్‌ కానుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ చిత్రం చైనా భాషలో డబ్బింగ్‌ కానుందట. ఇందుకు తగ్గ కార్యక్రమాలపై ‘అసురన్‌’ చిత్రబృందం దృష్టి పెట్టిందని కోలీవుడ్‌ టాక్‌. ‘బాహుబలి’, ‘దంగల్‌’ వంటి చిత్రాలు చైనీస్‌ బాక్సాఫీసు వద్ద భారతీయ సినిమా సత్తా చాటాయి. మరి...‘అసురన్‌’ కూడా చైనాలో సక్సెస్‌ అవుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.

మరిన్ని వార్తలు