అనంతపురంలో అసురన్‌

9 Jan, 2020 02:01 IST|Sakshi
వెంకటేశ్‌

తమిళ సూపర్‌ హిట్‌  చిత్రం ‘అసురన్‌’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు వెంకటేశ్‌. ఈ సినిమా ఎక్కువ శాతం చిత్రీకరణ రాయలసీమలో జరగనుందని తెలిసింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కలైపులి యస్‌.థాను, సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెల మధ్యలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని తెలిసింది. ఈ సినిమాను ఎక్కువగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారట. ఇందులో వెంకటేశ్‌ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్‌ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు