మూడేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డా!

12 Jun, 2015 23:36 IST|Sakshi
మూడేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డా!

‘‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది ....దాని జిమ్మదీయ అందమంతా చీరలోనె ఉన్నది’’ అంటూ ‘బంగారు బాబు’ సినిమాలో ఏఎన్నార్, వాణిశ్రీని పొగుడుతూ ఓ పాట పాడేశారు. ఇలా చీరకున్న గొప్పదనాన్ని చాలా మంది కవులు తమ రచనల్లో వర్ణించేవారు. స్త్రీలు ఎన్ని దుస్తులు ధరించినా చీరకు సాటి రాదంటారు చాలా మంది. విద్యాబాలన్‌ది కూడా ఇదే మా(బా)ట.
 
 ఈ విషయమై ఆమె మాట్లాడుతూ -‘‘నేను మూడేళ్ల వయసులోనే ఆరు గజాల  చీర తో ప్రేమలో పడిపోయా. మా అమ్మ చీరలన్నీ కట్టుకుని ఫొటోలు కూడా దిగాను కూడా. ఇప్పటికీ ఆ  ఆల్బమ్ నా దగ్గరే ఉంది. ఎన్ని గ్లామరస్ రోల్స్ చేసినా, నాకు చీర కట్టుకున్నప్పుడు ఉన్నంత  కంఫర్ట్‌నెస్, కిక్కు ఎన్ని ఆధునిక దుస్తులు వేసుకున్నా రాదు’’ అని చెప్పారు.
 
 తన దగ్గర ఉన్న శారీ కలెక్షన్ గురించి విద్యాబాలన్ చెబుతూ -‘‘నా దగ్గర చాలా చీరలున్నాయి. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఎప్పుడూ చీరలే బహుమతిగా ఇస్తూ ఉంటారు అమ్మా నాన్న  ఇచ్చిన కాంచీవరం పట్టుచీర , నా భర్త ఇచ్చిన ఎర్ర రంగు బెనార స్ శారీ ఈ రెండూ నాకు బాగా స్పెషల్. నాకు బాగా నచ్చిన చీర కట్టుకోమంటే మా అమ్మ పట్టుచీరల్లో ఒకదాన్ని ఎంచుకుంటా’’ అని చెప్పారు.