నిధి కోసం...

20 Dec, 2019 05:40 IST|Sakshi
రక్షిత్‌ శెట్టి, శాన్వి

రక్షిత్‌ శెట్టి, శాన్వి జంటగా నూతన దర్శకుడు సచిన్‌ తెరకెక్కించిన చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’. పుష్కర్‌ ఫిలింస్‌ పతాకంపై పుష్కర్‌ మల్లికార్జున్, హెచ్‌.కె. ప్రకాశ్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత ‘దిల్‌’ రాజు తెలుగులో జనవరి 1న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రక్షిత్‌శెట్టి మాట్లాడుతూ– ‘‘నిధి అన్వేషణ నేపథ్యంలో ఈ చిత్రకథ నడుస్తుంది. మూడేళ్లు కష్టపడి ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా చేశాం. ఇంజనీరింగ్‌ చదివే రోజుల్లో వంశీకృష్ణ అనే మిత్రుడి ద్వారా తెలుగుతో పరిచయం ఏర్పడింది.

అప్పట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌గార్ల సినిమాలు చూసేవాణ్ణి. తెలుగు ప్రజలకు సినిమా అనేది సంస్కృతిలో ఓ భాగం. ఇక్కడి ప్రేక్షకులు సినిమాని ఎలా ఆదరిస్తారో? ప్రేమిస్తారో తెలిసింది. అందుకే మా సినిమాని తెలుగులోనూ విడుదల చేస్తున్నాం. రామజోగయ్యశాస్త్రిగారు నాలుగు పాటలకు మంచి సాహిత్యం అందించారు’’ అన్నారు. ‘‘ఐదేళ్ల తర్వాత ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రహస్యాలతో కూడిన ఫ్యాంటసీ కథ ఇది. కొంత ఆలస్యమైనా మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నా’’ అన్నారు శాన్వీ. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సమావేశంలో పంపిణీదారుడు సతీష్, బాలాజీ మనోహర్, ప్రమోద్‌ శెట్టి, ఇమ్రాన్, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వన్య ప్రాణుల కోసం...

అలీకి మాతృవియోగం

ఈ సినిమా నాకు డబుల్‌ స్పెషల్‌

నిన్నే నిన్నే

పాటతో ప్యాకప్‌

అక్షయ్‌ 2 రజనీ 13 ప్రభాస్‌ 44

సంక్రాంతికి రెడీ

ఆ రెండు పాటలతో బన్నీ డబుల్‌ సెంచరీ

బిగ్‌బాస్‌: ‘నువ్వు లేకుండా నేనుండలేను’

రజనీ కొత్త చిత్రానికి కుదిరిన ముహూర్తం

సినిమాలో చూసి ఎంజాయ్‌ చేయడమే : విజయ్‌

సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్‌ కోహ్లి

అలీకి పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి

అశ్వథ్థామ నుంచి అందమైన పాట..

‘తిరుపతి పార్ట్‌నర్‌కు థ్యాంక్స్‌’

‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు

నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను!

డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది..

అలీకి మాతృ వియోగం, చిరు పరామర్శ

దక్షిణాదిలో జాన్వి ఎంట్రీ షురూ?

నటి పెళ్లి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌..

ఇది చాలదని చరణ్‌ అన్నారు

వైఫ్‌ ఆఫ్‌ రామ్‌

సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను

ఆటకైనా.. వేటకైనా రెడీ

బ్లాక్‌బస్టర్‌ బహుమతి

డిఫరెంట్‌ లుక్స్‌లో కీరవాణి తనయుడు..

ఇరగదీసిన సూపర్‌ స్టార్స్‌..

హ్యాపీ బర్త్‌డే పాప: వరుణ్‌ తేజ్‌

ఇట్స్‌ ప్యాకప్‌ టైమ్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వన్య ప్రాణుల కోసం...

అక్షయ్‌ 2 రజనీ 13 ప్రభాస్‌ 44

పాటతో ప్యాకప్‌

నిన్నే నిన్నే

సంక్రాంతికి రెడీ

అలీకి మాతృవియోగం