కొత్త కథాంశం

25 Sep, 2019 02:15 IST|Sakshi

ఇటీవల విడుదలైన వరుణ్‌ తేజ్‌ ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో అభిలాష్‌ పాత్రలో మంచి నటనను కనబరిచి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ యువ నటుడు అధర్వ మురళి. తమిళంలో అధర్వ హీరోగా నటించిన చిత్రం ‘బూమరాంగ్‌’. ఆర్‌. కణ్ణన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ఇందూజ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘కమర్షియల్‌ హంగులతో పాటు ప్రేక్షకులు కోరుకునే కొత్త కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. అధర్వ అద్భుతంగా నటించారు. రధన్‌ మంచి ఆల్బమ్‌ ఇచ్చారు. త్వరలో పాటలను, అక్టోబరులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు సీహెచ్‌ సతీష్‌కుమార్‌. సతీష్, ఆర్‌జె బాలాజీ, ఉపేన్‌ పటేల్‌ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు ప్రసన్న ఎస్‌.కుమార్‌ కెమెరామన్‌.

మరిన్ని వార్తలు