అధర్వ, హన్సిక చిత్రానికి డేట్‌ ఫిక్స్‌

24 Apr, 2019 10:14 IST|Sakshi

నటుడు అధర్వ, నటి హన్సిక జంటగా నటించిన చిత్రం 100. ఈ చిత్ర విడుదలకు డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. బూమరాంగ్‌ చిత్రం తరువాత నటుడు అధర్వ నటించిన చిత్రం 100. ఇంతకు ముందు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేసిన ఆరా సినిమస్‌ సంస్థ చిత్ర నిర్మాణంలోకి దిగి నిర్మిస్తున్న చిత్రం ఇది. అధర్వకు జంటగా హన్సిక నటిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్‌ (తమిళ్‌) సినిమాకు దర్శకత్వం వహించిన శ్యామ్‌ అంటన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

నటి హన్సిక కోలీవుడ్‌ తెరపైకి వచ్చి చాలా కాలం అయ్యింది. దీంతో 100 చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. పైగా 100 అనగానే ఇదేదే పోలీస్‌ ఇతి వృత్తంతో కూడిన చిత్రం అనిపిస్తోంది కదూ! అవును ఇది అలాంటి కథా చిత్రమే. ఇందులో అధర్వ పోలీస్‌ అధికారిగా నటించారు. లవ్, యాక్షన్, కామెడీ అంశాలతో కూడిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని యూనిట్‌ వర్గాలు తెలిపారు. యోగిబాబు, మైమ్‌గోపి, రాహుల్‌దేవ్, రాధారవి, రమేశ్‌ఖన్నా, వీటీవీ.గణేశ్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి సంగీతం శ్యామ్‌ సీఎస్‌ అందించారు.

100 చిత్రాన్ని మే 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. కార్మికుల దినోత్సవం అయిన మేడే రోజున నటుడు గౌతమ్‌ కార్తీక్‌ నటించిన దేవరాట్టం, అరుళ్‌నిధి నటించిన కే 13 చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో రెండు రోజుల తరువాత అధర్వ, హన్సికల చిత్రం 100ను విడుదల చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ప్రస్తుతం హన్సిక మహా చిత్రంలో నటిస్తోంది. హీరోయిన్‌ సెంట్రిక్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆమెకు 50వ చిత్రం అన్నది తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’