ఎటూ కాని హృదయం!

11 Apr, 2016 23:02 IST|Sakshi
ఎటూ కాని హృదయం!

ప్రేమ, వినోదం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం - ‘అటు ఇటు కాని హృదయం తోటి’. జగదీష్, లిపి (శుభాంగీ పంథ్) జంటగా జేకేజీ చౌదరి దర్శకత్వంలో లిపి భార్గవ ప్రొడక్షన్స్, విమన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు డీవీ కృష్ణమూర్తి, ఆంజనేయులు మాట్లాడుతూ- ‘‘మా దృష్టిలో కథే హీరో. కథ బాగుంటేనే ఏ చిత్రమైనా హిట్ అవుతుంది. చిత్రం రెండో షెడ్యూల్ ఈ నెలాఖరుకి పూర్తి చేస్తాం. ఇందులోని 5 పాటలూ ఆకట్టుకుంటాయి. త్వరలోనే పాటలు విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్, కెమేరా: సునీల్.జి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి