నటి తండ్రిపై ఆటో డ్రైవర్‌ దాడి

17 Oct, 2017 11:22 IST|Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి సుమోన చక్రవర్తి తండ్రిపై ఓ ఆటో డ్రైవర్‌ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాల నటిగా కెరీర్‌ను ఆరంభించిన సుమోన.. కపిల్‌ శర్మ షోతోపాటు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు.

ముంబై మిర్రర్‌ కథనం ప్రకారం... అంధేరీ సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రి సమీపంలో వీరి కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఓరోజు సుమోన తండ్రి సుజిత్‌.. తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవటంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆటోను మాట్లాడుకునేందుకు రోడ్డు మీదకు రాగా.. ఒక ఆటో డ్రైవర్‌ ఎక్కువ  డిమాండ్‌ చేయటంతో అతనితో సుజిత్‌ వాదనకు దిగారు. 

ఈ క్రమంలో ఆ ఆటోడ్రైవర్‌ సుజిత్‌ను బండరాయితో మోది తీవ్రంగా గాయపరిచాడు. అది గమనించిన సుమోన తల్లి.. గాయపడిన సుజిత్‌ను స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పొవాయి పోలీసులు దృవీకరించారు కూడా. సుమోన, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుకాగా, ప్రత్యక్ష సాక్ష్యుల స్టేట్‌మెంట్ మేరకు ఆటో డ్రైవర్‌ అమిత్‌ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 5000 రూపాయల పూచీకత్తు మీద చివరకు అతనికి బెయిల్ లభించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా