మా ఆయనతో సినిమా చేస్తా: హీరో భార్య

2 Jun, 2020 18:41 IST|Sakshi

విలక్షణ పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ యువ హీరో ఆయుష్మాన్‌ ఖురానాతో సినిమా చేయాలనుకుంటున్నట్లు భార్య తాహిరా కశ్యప్‌ వెల్లడించారు. అతనితో కలిసి పనిచేయడం ఎంతో ఇష్టమని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా సినిమా దర్శకత్వం ఆలోచన వాయిదా పడిందని తెలిపారు. కాగా, థియేటర్‌ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ అయిన తాహిరా  టోఫీ, పిన్ని వంటి షార్ట్‌ ఫిల్మ్‌లతో గుర్తింపు పొందారు. ఇక సినిమా రంగంలో తనకంటే సీనియర్‌ అయిన ఆయుష్మాన్‌ను అప్పుడే డైరెక్ట్‌ చేయాలని అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. రెండు, మూడు సినిమాలు చేశాక.. ఆ అర్హత సంపాదిస్తానని వెల్లడించారు.
(చదవండి: ‘ఈ ప్రపంచానికి నీ వయసు చెప్పలేను’)

ఆయుష్మాన్‌ ఓ గొప్ప ఆర్టిస్ట్‌ అని తాహిర్‌ భర్తను కొనియాడారు. తాము భార్యభర్తలు కావడంతో అతనితో సినిమా విషయంలో ఒకింత భయం కూడా ఉందని, అయితే దానిని అదిగమిస్తామని తెలిపారు. తన స్క్రిప్ట్‌లు విని ఫీడ్‌బ్యాక్‌ అందించిన తొలి వ్యక్తి తనేనని తాహిరా తెలిపారు. కాగా, క్యాన్సర్‌ బారినపడిన తాహిరా దుబాయ్‌లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. తన భార్య జబ్బు బారిన పడటంతో ఉదయం పూట సినిమా షూటింగ్స్‌, సాయంత్రం పూట భార్య బాగోగులు చూసుకున్న ఆయుష్మాన్..‌. ఆమె కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ కార్వా చౌత్‌ (ఉపవాసం) కూడా నిర్వహించారు. ఆ విశేషాలను తాహిరా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. వీరికి 2008లో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు.
(చదవండి: గులాబో సితాబో డిజిటల్‌ రిలీజ్‌)

Embarrassing you further @ayushmannk Our #karvachauth moment! While I am in Dubai for an event, my certainly better half keeps a fast for me on his set! (p.s I am still popping some pills so couldn’t fast) But how adorable are you Mr A ! Love you so much❤️ #fastinghusbands thank you @shrutiv11 for capturing this moment!

A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా