అతడికి నో చెప్పిన ఐష్!

27 Jun, 2016 17:00 IST|Sakshi
అతడికి నో చెప్పిన ఐష్!

ముంబై: అజయ్ దేవగణ్ తాజా చిత్రం 'బాద్ షాహో' సినిమా తారాగణం ఇప్పటికే పలుమార్లు మారింది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరు ఈ లిస్టులో చేరింది. మిలాన్ లుతరియా తొలిసారి దర్శకత్వం వహిస్తున్న 'బాద్ షాహో'లో నటించేందుకు ఐష్ నిరాకరించింది. దిల్జిత్ దొసాన్ జహ్ స్థానంలో ఇమ్రాన్ హష్మిని తీసుకోవడం వల్లే ఆమె ఈ ఆఫర్ వదులుకుందని టాక్.

ఇమ్రాన్ హష్మితో కొన్ని సీన్లు చేయాల్సి రావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గతంలో కరణ్ జోహార్ కార్యక్రమంలో ఇమ్రాన్ ను 'ప్లాస్టిక్'గా ఐష్ వర్ణించింది. ఈ కారణంగానే అతడి పక్కన నటించేందుకు ఆమె అంగీకరించలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 'బాద్ షాహో'లో మహరాణి గాయత్రి దేవి స్ఫూర్తితో ఈ పాత్రను రూపొందించినట్టు తెలుస్తోంది.

ఇందులోని పాత్రలు చాలా కొత్తగా ఉంటాయని, ఇటువంటి పాత్రలు ఇంతకుముందు ఎవరూ పోషించలేదని మిలాన్ లుతరియా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని  భావిస్తు్న్నారు.