తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ఈ విజువల్ వండర్‌కు ఇప్పుడు సీక్వల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ఎప్పుడవుతుందని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బాహుబలి తొలి భాగం విషయంలో ఎలా అయితే నటీనటుల పుట్టిన రోజుకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడో.. అదే ఫార్ములాను బాహుబలి 2 విషయంలో కూడా ఫాలో అవుతున్నారట.
అందుకే బాహుబలి తొలి పోస్టర్‌ను హీరో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ పోస్టర్‌ను కేవలం ప్రభాస్ లుక్ తోనే డిజైన్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. బాహుబలి తొలి భాగం విషయంలో ఈ ఫార్ములా క్లిక్ అయిన నేపథ్యంలో మరోసారి అదే పద్దతిని ఫాలో అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.