బాహుబలి 2 ట్రైలర్‌ వచ్చేసింది

16 Mar, 2017 10:01 IST|Sakshi
బాహుబలి 2 ట్రైలర్‌ వచ్చేసింది
సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ది కంక్లూజన్ ట్రైలర్‌ వచ్చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం భాషల్లో బాహుబలి 2 ది కంక్లూజన్ ట్రైలర్లు విడుదలయ్యాయి. మొదట ఒక నిమిషం 52 సెకన్ల నిడివి కలిగిన తమిళ ట్రైలర్‌ ఆన్‌లైన్‌లో బయటకొచ్చింది. ఆ తర్వాత రెండు నిమిషాల 24 సెకన్ల నిడివి కలిగిన హిందీ ట్రైలర్‌ను కరణ్‌ జోహర్‌ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. గురువారం ఉదయం సినీమ్యాక్స్‌లో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి ప్రభాస్‌, రానాలు హాజరయ్యారు. 
 
సినిమాపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ మైండ్‌ బ్లోయింగ్‌ వీఎఫ్‌ఎక్స్‌తో ట్రైలర్‌ రూపుదిద్దుకుంది. రమ్యకృష్ణ కాలిని ఎవరో తాకుతున్నట్లు మొదలైన తమిళ ట్రైలర్‌.. బాహుబలిని కట్టప్ప పొడిచి చంపడం.. లాంటి ఉత్కంఠ భరిత సీన్లతో ముందుకు సాగింది. అయితే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను పొడిగిస్తూ.. ప్రశ్నార్ధకంగానే ఉంచేశారు. బాహుబలి-2లో ప్రభాస్‌, రానాలు ఈ సినిమాలో హీరో, విలన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అనుష్క, తమన్నాలు హీరోయిన్లు. ఆర్కా మీడియా వర్క్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
 
తెలుగు ట్రైలర్‌