బాహుబలి కోసం లక్షమంది..!

7 Jan, 2017 14:04 IST|Sakshi
బాహుబలి కోసం లక్షమంది..!

టాలీవుడ్ విజువల్ వండర్ బాహుబలి యూనిట్ గుమ్మడికాయ కొట్టేసింది. మూడున్నరేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్గా పూర్తయ్యింది. తెలుగు సినిమా స్థాయిని, మార్కెట్ పరిథిని ఎన్నో రెట్లు పెంచిన బాహుబలికి పని చేసిన ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. అదే సమయంలో దేశం గర్వించదగ్గ సినిమాకు పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అయ్యారు. యూనిట్ సభ్యులు ఆఖరి రోజు షూట్ను సరదాగా ముగించారు. యూనిట్ సభ్యులంతా ఒకే రకమైన టీషర్లు వేసుకొని ఫోటోలు దిగుతూ సందడి చేశారు.

అయితే యూనిట్ సభ్యులు వేసుకున్న టీషర్ట్ల పై ఉన్న మ్యాటర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'ఒక అద్భుతమైన అనుభవం, 5 సంవత్సరాలు, 613 రోజుల షూటింగ్, 2 బ్లాక్ బస్టర్లు, లక్ష మంది యూనిట్, ఇంకా నేను' అంటూ రాసి ఉన్న టీషర్ట్లను బాహుబలి యూనిట్ ధరించింది. అయితే మిగతా అన్నింటి సంగతీ ఎలా ఉన్నా.. బాహుబలి సినిమాకు లక్షమంది యూనిట్ సభ్యుల పని చేశారన్న లైన్ మరింత ఆసక్తి కలిగిస్తోంది. బాహుబలి భారీ చిత్రమే అయినా ఏకంగా లక్షమంది పనిచేశారంటే మాత్రం కాస్త అతిషయోక్తిగానే ఉందంటున్నారు విశ్లేషకులు.