అమెరికాలో పీకేను దాటిపోయిన బాహుబలి

11 Jul, 2015 15:41 IST|Sakshi
అమెరికాలో పీకేను దాటిపోయిన బాహుబలి

రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్న బాహుబలి అమెరికాలో కూడా ఇదే ట్రెండును కొనసాగిస్తోంది. అమీర్ఖాన్ నటించిన 'పీకే' సినిమా ఇప్పటివరకు అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాల తొలిరోజు వసూళ్లలో టాప్. ఆ సినిమాకు మొదటిరోజు 6.12 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

బాహుబలి తొలిరోజు 8.24 కోట్ల రూపాయల కలెక్షన్లతో పీకేను దాటిపోయింది. భారతదేశంలో ఇప్పటికే 60 కోట్ల తొలిరోజు వసూళ్లతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమీర్ఖాన్ పీకే రికార్డును కూడా తలదన్ని దూసుకెళ్తోంది.  తొలిరోజు అమెరికాలో పెయిడ్ ప్రివ్యూలు ఉంటాయి. వీటి ద్వారానే ఈ కలెక్షన్లు వచ్చినట్లు చెబుతున్నారు.

>