బాహుబలి లీక్పై నిర్మాత క్లారిటీ

26 Apr, 2017 14:18 IST|Sakshi
బాహుబలి లీక్పై నిర్మాత క్లారిటీ

ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు రెడీ అవుతున్న బాహుబలి 2 సినిమాను పైరసీ భూతం భయపెడుతోంది. సాంకేతికంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులను మాత్రం అరికట్ట లేకపోతున్నారు. తాజాగా బాహుబలి 2 సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా షోస్ పడక ముందే ఈ ఫోటోస్ బయటకు రావటంతో సినిమా లీకైంది ప్రచారం మొదలైంది.

అయితే ఈ విషయంపై నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఇంత వరకు బాహుబలి 2కు సంబంధించిన ప్రదర్శనలు మొదలు కాలేదని తెలిపారు. అయితే పలు దేశాల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఆయా దేశాల్లో సెన్సార్ సభ్యులకు ప్రదర్శన వేశామని తెలిపారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోలు సెన్సార్ సమయంలో తీసినవే అయి ఉంటాయని భావిస్తున్నారు.