జాతీయ అవార్డుల విజేతలు వీరే

29 Mar, 2016 03:12 IST|Sakshi
జాతీయ అవార్డుల విజేతలు వీరే

రికార్డుల మీద రికార్డులు సృష్టించుకుంటూ వెళ్తున్న బాహుబలి సినిమా సిగలో మరో అరుదైన గౌరవం చేరింది. 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమా జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. దీంతోపాటు జాతీయస్థాయిలో ఉత్తమ స్పెషల్ ఎఫెక్టుల అవార్డు కూడా ఈ సినిమాకే దక్కింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా 600 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో పాటు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికై, తెలుగు సినిమా కీర్తి ప్రతిష్ఠలను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఇంతకుముందు జాతీయ స్థాయిలో శంకరాభరణం సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు రావడం ఇదే ప్రథమం.

ఇతర జాతీయ అవార్డులు ఇలా ఉన్నాయి...


ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (పికు)
ఉత్తమ నటి: కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రెమో డిసౌజా (బాజీరావు మస్తానీ)
ఉత్తమ హిందీ చిత్రం: దమ్ లగాకే హైసా
ఉత్తమ తెలుగు చిత్రం: కంచె
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: నీరజ్ ఘేవాన్ (మసాన్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్టులు: బాహుబలి
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్ చటర్జీ (బాజీరావు మస్తానీ)
ఉత్తమ సహాయనటుడు: సముద్రకని (విసారనై)
ఉత్తమ సహాయనటి: తన్వీ అజ్మీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ బాల నటుడు: గౌరవ్ మీనన్ (బెన్)
ఉత్తమ బాలల చలనచిత్రం: దురంతో
జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రం: నానక్ షా ఫకీర్
పర్యావరణ పరిరక్షణపై ఉత్తమచిత్రం: వాలియా చారకుల్ల పక్షికల్
ఉత్తమ గాయని: మోనాలి ఠాకూర్ (మోహ్ మోహ్ కే ధాగే.. దమ్ లాగాకే హైసా)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: బజరంగీ భాయీజాన్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: విశాల్ భరద్వాజ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జుహు చతుర్వేది (పికు), హిమాన్శు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్)

ఉత్తమ కొరియోగ్రఫీ: రెమో డిసౌజా (బాజీరావ్ మస్తానీలో 'దివానీ మస్తానీ' పాట)
ఉత్తమ చలనచిత్రం (నర్గీస్ దత్ జాతీయ సమైక్యత పురస్కారం): నానక్ షా ఫకీర్
ఉత్తమ మలయాళ సినిమా: పథేమరి
ఉత్తమ సామాజిక చిత్రం: నిర్ణయకం
పర్యావరణం పరిరక్షణపై ఉత్తమ చిత్రం: వలియ చిరుకుల్లా పక్షికల్
ఉత్తమ బాలల చిత్రం: దురంతో
ఉత్తమ తమిళ సినిమా: విసారనై
ఉత్తమ తెలుగు సినిమా: కంచె
ఉత్తమ సంస్కృత సినిమా: ప్రియమానసం
ఉత్తమ కన్నడ సినిమా: థిథీ
ఉత్తమ పంజాబీ సినిమా: చౌథీ కూట్‌
ఉత్తమ కొంకణి సినిమా: ఎనిమీ
ఉత్తమ అస్సామీ సినిమా: కొథానొడి
ఉత్తమ హర్యాన్వి సినిమా: సత్రంగి
ఉత్తమ ఖాసి సినిమా: ఒనాటా
ఉత్తమ మణిపురి సినిమా: ఐబసు యావోహన్‌బియూ
ఉత్తమ మిజో సినిమా: కిమస్‌ లోడ్ బియాండ్‌ ద క్లాస్‌
ఉత్తమ ఒడియా సినిమా: పహడ ర లుహా
స్పెషల్ మెన్షన్: 'ఇరుధి సుత్రు'కు గాను రితికాసింగ్