'బాహుబలి'కి అరుదైన గౌరవం

9 May, 2016 18:32 IST|Sakshi
'బాహుబలి'కి అరుదైన గౌరవం

ముంబై: 'బాహుబలి' సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా జరిగే చర్చల్లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొంటారు. విర్చువల్ రియాలిటీ(వీఆర్) అంశంపై వీరు చర్చలో పాల్గొననున్నారు. వీరితో పాటు రాడియన్ టెక్నాలజీస్ గ్రూపు(ఆర్టీజీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా కోడూరి కూడా అక్కడికి వెళ్లనున్నారు.

మే 11 నుంచి మే 22 వరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. మే 16న 'బాహుబలి' సినిమాను పదర్శించనున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన 'బాహుబలి' బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టడమే కాకుండా ఇటీవల 63వ జాతీయ చలనచిత్ర అవార్డును దక్కించుకుంది. దీనికి కొనసాగింపుగా 'బాహుబలి 2' తెరకెక్కిస్తున్నారు.