బ్యాంకాక్‌లో బాహుబలి.. లండన్‌లో కట్టప్ప

13 Mar, 2018 00:05 IST|Sakshi
ప్రభాస్‌, సత్యరాజ్‌ మైనపు విగ్రహాలు

ముందు బాహుబలి (ప్రభాస్‌) బొమ్మ.. ఇప్పుడు కట్టప్ప (సత్యరాజ్‌) బొమ్మ కూడా కనువిందు చేయనుంది. ఎక్కడ అంటే? మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో. తుస్సాడ్స్‌ బ్యాంకాక్‌ శాఖలో ఇప్పటికే బాహుబలి కొలువు దీరాడు. ఇప్పుడు లండన్‌ శాఖలో కట్టప్ప కనిపించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే ప్రముఖుల మైనపు విగ్రహాలను తుస్సాడ్స్‌ వారు మ్యూజియంలో ప్రతిష్టించే విషయం తెలిసిందే.

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని బాహుబలి గెటప్‌లోనే ప్రతిష్టించారు. ఇదే సినిమా ద్వారా బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్న సత్యరాజ్‌ విగ్రహాన్ని కట్టప్ప గెటప్‌లో పెట్టాలని తుస్సాడ్స్‌ నిర్ణయించుకుంది. త్వరలో సత్యరాజ్‌ని కలిసి విగ్రహ కొలతలు తీసుకోనున్నారు. లండన్‌ తుస్సాడ్స్‌లో చోటు సంపాదించుకోబోతున్న తొలి తమిళ నటుడు సత్యరాజే కావడం విశేషం. తమిళంలో ఆయన దాదాపు 200 పై చిలుకు సినిమాలు చేసినా ఒక్క ‘బాహుబలి’ ఆయన్ను వరల్డ్‌ వైడ్‌గా పాపులర్‌ చేసేసింది.

మరిన్ని వార్తలు