బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

30 Jul, 2019 18:55 IST|Sakshi

బిగ్‌బాస్‌లో మొదటి వారం గడిచిపోయింది. కోపాలు, అలకలు, ప్రేమలు ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో నిండిన ఆ ఇంట్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించలేం. ఇంట్లోంచి హేమ ఫస్ట్‌ ఎలిమినేట్‌ కాగా..రెండో వారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ కూడా అయిపోయింది. పద్నాలుగు మంది నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొనగా.. వితికాను మినహాయించిన సంగతి తెలిసిందే. నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా.. వరుణ్‌ సందేశ్‌తో వితిక గుసగుసలాడుకుంటూ ఉండటంతో ఆమెను మినహాయించారు.

ఇక ఈ మొత్తం ప్రాసెస్‌లో బాబా భాస్కర్‌ హైలెట్‌గా నిలిచాడు. తాను ఎవర్నీ అంచనా వేయలేకపోతున్నానని, అందరూ మంచివారేనని తానేవర్నీ నామినేట్‌ చేయనని బిగ్‌బాస్‌కు తేల్చి చెప్పాడు. కొంత సమయం తీసుకుని మళ్లీ కన్ఫెషన్‌ రూమ్‌కు వచ్చి ఇద్దరిని నామినేట్‌ చేయాల్సిందిగా ఆదేశించాడు. అయినా సరే బాబా భాస్కర్‌ ఎవరినీ నామినేట్‌ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో విసుగుచెందిన బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ అందర్నీ హెచ్చరించాడు. బాబా భాస్కర్‌ నామినేషన్‌ ప్రక్రియలో ఎవరినీ నామినేట్‌ చేయనందున హౌస్‌మేట్స్‌ అందరూ నామినేషన్‌లో ఉండటం.. లేదా అందరూ కలిసి బాబా భాస్కర్‌ను నామినేట్‌ చేయడం అంటూ రెండు ఆప్షన్స్‌ ఇచ్చాడు. దీంతో బాబా భాస్కర్‌ వెనక్కు తగ్గి నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొంటానంటూ వితికా, రాహుల్‌ను నామినేట్‌ చేశాడు.

ఇక ఈ విషయంపై బాబా భాస్కర్‌ వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అతి మంచితనం కూడా చేటే అని కొందరు అంటుంటే.. రియల్‌ రేలంగి మామ అని మరికొందరు పొగిడేస్తున్నారు. బిగ్‌బాస్‌కు ఎదురు తిరుగుతున్న బాబా భాస్కర్‌ అంటూ రకరకాల మీమ్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతకీ రేలంగి మామయ్య అంటే తెలుసు కదా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ పోషించిన పాత్ర అది. మనుషులు మంచోళ్లు అని అసలు మనుషులంటేనే మంచోళ్లు అంటూ అతి మంచితనంతో ప్రకాశ్‌ రాజ్‌ పోషించిన ఆ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే బిగ్‌బాస్‌లో మాత్రం బాబా భాస్కర్‌.. రేలంగి మామయ్య అంటూ నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’