బిగ్‌బాస్‌లో నా అంచనా తప్పింది : బాబు గోగినేని

16 Aug, 2018 14:14 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌజ్‌లోంచి ఎలిమినేట్‌ అయి బయటకు వెళ్లిన బాబు గోగినేని.. ఆ షోలో జరిగిన సంఘటనలపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు బయటకొచ్చాక చేసే కామెంట్స్‌ వివాదాస్పదం అవుతుండటం మామూలే. ఇక గత వారం ఎలిమినేట్‌ అయిన బాబు గోగినేని బిగ్‌బాస్‌ హౌజ్‌ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. బిగ్‌బాస్‌ షోలోకి ఎందుకు వెళ్లారని కొందరు అడుగుతున్నారని.. తనకు నచ్చడం వల్లే షోలోకి వెళ్లానని చెప్పుకొచ్చారు. చివరి వరకు బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎవరు ఉంటారో కూడా అంచనా వేశారు. 

బిగ్‌బాస్‌ ఒక పిచ్చివాళ్ల స్వర్గమని అందరూ అంటున్నారని .. అందులో ఉండటం అదో రకమైన అనుభవమంటూ చెప్పుకొచ్చారు. షోలో మొదట్నుంచీ కౌశల్‌తో విబేధించే బాబు.. అతను ఫైనల్‌ లిస్ట్‌లో ఉండే అవకాశముందని చెప్పుకొచ్చారు. కౌశల్‌కు ఇంటా, బయటా సపోర్ట్‌ ఉందని.. అతను గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని.. అభిప్రాయపడ్డారు. అయితే మొదటగా తేజస్వీ గెలుస్తుందని అంచనా వేశానని..  కానీ తాను ఎలిమినేట్‌ అయి వెళ్లిపోయిందని చెప్పారు. దాంతో తన అంచనా తప్పిందని తెలిపారు. 

కౌశల్‌ నచ్చలేదు కాబట్టి తనను వ్యతిరేకించానని, అంతేకాని టార్గెట్‌ చేయలేదంటూ చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత విషయాలను, ఎప్పుడో బయట జరిగిన విషయాలను బిగ్‌బాస్‌ హౌజ్‌లో ప్రస్తావించడం.. కరెక్ట్‌ కాదంటూ అందుకే అలా చేశానని చెప్పుకొచ్చారు. ఈ వారం బిగ్‌బాస్‌ షో ఆద్యంతం రసవత్తరంగా సాగుతోంది. హౌజ్‌మేట్స్‌ పబ్లిక్‌ కాలర్స్‌, బిగ్‌ బాస్‌ హౌజ్‌ కాల్‌సెంటర్‌గా విడిపోయి చేస్తున్న టాస్క్‌కు విశేష స్పందన వస్తోంది. ఇక ఈ వారం దీప్తి సునయనకు ఎలిమినేషన్‌ తప్పేట్టు లేదనిపిస్తోంది. 
 

చదవండి.. బిగ్‌బాస్‌ : సునయన ఎలిమినేషన్‌ తప్పదా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా