‘జెండా ఫూల్’ సాంగ్‌పై ముదిరిన వివాదం

31 Mar, 2020 18:58 IST|Sakshi

హీరోయిన్ జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్‌, సింగ‌ర్ బాద్‌షాపై నెటిజ‌న్లు గ‌రం అవుతున్నారు. ఇత‌రుల ప్ర‌తిభ‌ను కొట్టేసి అది మీదేన‌ని చెప్పుకోడానికి మ‌న‌సెలా వ‌చ్చింద‌ని నిల‌దీస్తున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి ఆడిపాడిన మ్యూజిక్ ఆల్బ‌మ్ ‘జెండా ఫూల్’ ఈ మ‌ధ్యే రిలీజ్ అయింది. దీనికి ఎంత‌గా విశేష ఆద‌ర‌ణ ద‌క్కిందో, అంతే స్థాయిలో విమ‌ర్శ‌ల‌పాల‌వుతోంది. దీని మూలాలు బెంగాలీ పాట‌ను గుర్తు చేస్తున్నాయి. దీంతో ఇది బెంగాలీ ఫోక్ సాంగ్ అని, ఒరిజిన‌ల్ పాట‌కు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అయిన‌ జాన‌ప‌ద క‌ళాకారునికి గుర్తింపునివ్వ‌క‌పోవ‌డం దారుణమ‌ని నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. అత‌డి అనుమ‌తి లేకుండా నిర్దాక్షిణ్యంగా కాపీ కొట్టార‌ని విరుచుకుప‌డుతున్నారు. 

ఈ విషయం గురించి బెంగాలీ సంగీత‌కారుడు రోహ‌న్ దాస్‌గుప్తా స్పందిస్తూ.. ‘ర‌త‌న్ క‌హార్ అనే బెంగాల్ జాన‌ప‌ద క‌ళాకారుడు ఈ పాట‌ను రూపొందించ‌డంతోపాటు తానే స్వ‌యంగా లిరిక్స్ రాసి పాడాడు. ఇప్పుడు వ‌చ్చిన జెండా ఫూల్.. అత‌ను 1970లో "బోరోలోక‌ర్ బీటీ లో" అంటూ గొంతెత్తి పాడాడు. దుర‌దృష్ట‌మేంటంటే తాజా పాట సంగీతం, లిరిక్స్‌పై హ‌క్కులు కోరుతూ దావా వేసేందుకు అత‌ని ద‌గ్గ‌ర డ‌బ్బు లేదు. కానీ ఈ పాట అచ్చంగా అత‌నిదేన‌న్న నిజం అంద‌రికీ తెలియాలి’ అని కోరుతూ ట్వీట్ చేశాడు. యూట్యూబ్‌లో ‘జెండా ఫూల్’ పాట‌ వీడియోలో అత‌ని పేరును కూడా చేర్చాలంటూ ప‌లువురు నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ర‌త‌న్ క‌హార్ ప‌శ్చిమ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లాలో శౌరి గ్రామంలో నివ‌సిస్తున్నారు. (సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!)

మరిన్ని వార్తలు