చైనాలో 6000 ప్లస్‌!?

2 Jun, 2017 23:31 IST|Sakshi
చైనాలో 6000 ప్లస్‌!?

ఇండియాలో వసూళ్ల జాతర సృష్టించిన ‘బాహుబలి–2’ను వచ్చే నెలాఖరున చైనాలో రిలీజ్‌ చేయాలని దర్శక – నిర్మాతలు భావిస్తున్నారట! చైనాతో పాటు యూరప్, ఇతర విదేశాల్లో విడుదల చేయడానికి సిన్మాను కాస్త ట్రిమ్‌ చేయిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ ఎడిటర్, ‘హల్క్‌’ ఫేమ్‌ విన్సెంట్‌ టబైల్లోన్‌ ఇప్పుడా పనిలో ఉన్నారు.

 ‘బాహుబలి’ ఇంటర్నేషనల్‌ వెర్షన్‌ను కట్‌ చేసింది ఈయనే. వసూళ్లను పక్కన పెడితే ‘బాహుబలి’ చైనాలో 6000 స్క్రీన్స్‌ లో రిలీజైంది. ‘బాహుబలి–2’ను అంతకంటే ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారట! ఇండియన్‌ మార్కెట్‌లో ‘దంగల్‌’ను బీట్‌ చేసిన ‘బాహుబలి–2’ చైనాలో కూడా బీట్‌ చేస్తుందా? వెయిట్‌ అండ్‌ సీ!! ఎందుకంటే... చైనాలో ఏడు వేల స్క్రీన్‌లలో విడుదలైన ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

 ఇండియాలో కంటే చైనాలో ఎక్కువ వసూళ్లు సాధిస్తోన్న ‘దంగల్‌’ రేపో మాపో అక్కడ వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్‌ చేయడం కన్ఫర్మ్‌. ఇండియాలో వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా ‘బాహుబలి–2’ రికార్డు సృష్టించింది. ఎప్పుడైతే ఆమిర్‌ సినిమా చైనాలో విడుదలైందో అప్పుడు లెక్కలు మారాయి. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ మూవీగా ‘దంగల్‌’ రికార్డులకు ఎక్కింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి