కొనసాగుతున్న బాహుబలి హవా

14 Nov, 2015 12:24 IST|Sakshi
కొనసాగుతున్న బాహుబలి హవా

బాహుబలి సినిమా విడుదలై నాలుగు నెలలు దాటుతున్న ఇంకా.. ఏదో ఒక రూపంలో ఈ సినిమా వార్తల్లో కనిపిస్తూ, వినిపిస్తూనే ఉంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన బాహుబలి. చిత్రయూనిట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళికి ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ తీసుకొచ్చింది. సినిమా విడుదలైన దగ్గర నుంచి ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకున్న బాహుబలి తాజాగా మరో చిత్రోత్సవానికి ఎంపికయ్యింది.

ఇప్పటికే బుసాన్, టొరెంటో, తైపై గోల్డ్ హార్స్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన బాహుబలి. తాజాగా ఆసియాలోనే బిగెస్ట్ ఫిలిం ఫెస్టివల్స్ లో ఒకటైన బ్లాక్ నైట్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కానుంది. ఎస్తోనియాలో జరుగుతున్న ఈ ఫిలిం ఫెస్టివల్ లో శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో రిలీజైన బాహుబలి సినిమాను ఈ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శన తరువాత జపాన్, చైనా, ఇండోనేషియా, థాయ్ లాండ్, వియత్నాం, కంబోడియా, మయన్మార్ లాంటి దేశాల్లో విడుదలకు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్రభాస్, రానా, రమ్య కృష్ణ, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి తొలి భాగం ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళు చేసింది. తాజాగా ఈ సినిమా సీక్వల్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.