‘జై సింహా’లో అవే హైలెట్..!

6 Jan, 2018 12:27 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై సింహా. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకుడు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో నందమూరి అభిమానులను అలరించే అంశాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయన్న టాక్ వినిపిస్తోంది.

బాలయ్య మార్క్ భారీ డైలాగులు, చిరంతన్ భట్ సంగీతంతో పాటు కం‍టతడిపెట్టించే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయట. బాలయ్య డ్యాన్స్ మూమెంట్స్ కూడా అభిమానులను ఫుల్ ఖుషీ చేయనున్నాయి. కేయస్ రవికుమార్ రేసీ స్క్రీన్ ప్లే తో పాటు సీ కళ్యాణ్ నిర్మాణ విలువలు కూడా సినిమా రేంజ్ ను పెంచాయట.

మరిన్ని వార్తలు