మా ప్రయత్నాన్ని ఆదరించారు

23 Dec, 2019 01:22 IST|Sakshi
సి.కల్యాణ్, వేదిక, బాలకృష్ణ

– బాలకృష్ణ

‘‘రూలర్‌ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. మేం ఓ మంచి ప్రయత్నం చేశాం.. మా ప్రయత్నానికి విజయాన్ని అందించారు. సి.కల్యాణ్‌గారితో నేను చేసిన మూడో సినిమా ఇది. మంచి కథా విలువలున్న చిత్రం చేయాలని భావించే ఆయనకు నా తరఫున, అభిమానుల తరఫున కృతజ్ఞతలు’’ అని  బాలకృష్ణ అన్నారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, వేదిక, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రూలర్‌’. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (డిసెంబర్‌ 20) విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ పరుచూరి మురళిగారు మంచి కథ, డైలాగ్స్‌ను అందించారు.

ఈ కథలో మంచి సందేశాన్ని కూడా చొప్పించినందుకు ఆయనకు థ్యాంక్స్‌. ఆర్టిస్టుల దగ్గర నుంచి తనకు ఏం కావాలో రాబట్టుకునే దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌గారు. ఆయన నిర్మాతల దర్శకుడు కూడా. మా సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘జై సింహా’ తర్వాత మా కాంబినేషన్‌ లో వచ్చిన ‘రూలర్‌’ సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌.  మా కాంబినేషన్‌లో వచ్చే తర్వాతి చిత్రం ‘రూలర్‌’ కంటే మంచి చిత్రం అవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకుంటున్నందుకు వెరీ హ్యాపీ’’ అన్నారు వేదిక. ‘‘జైసింహా’ తర్వాత అదే కాంబినేషన్‌ లో వచ్చిన ‘రూలర్‌’కి సినిమాటోగ్రఫీ అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు కెమెరామేన్‌ రాంప్రసాద్‌. ‘‘కల్యాణ్‌గారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని పరుచూరి మురళి అన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనాపై పోరుకు బాలయ్య విరాళం

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’

సినిమా

కరోనాపై పోరుకు బాలయ్య విరాళం

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!