భగవంతుడే పోలీసుల రూపంలో: బాలకృష్ణ

6 Dec, 2019 15:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిశ నిందితులను శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సినీ నటుడు నందమూరి బాలకృష్ణ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ‘భగవంతుడే పోలీసుల రూపంలో దిశ నిందితులకు సరైన శిక్ష విధించాడు, మరొకసారి ఎవరూ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా, అసలు అటువంటి ఆలోచనే మొలకెత్తనివ్వకుండా అందరికీ ఇదొక గుణపాఠం కావాలి.. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది’ అని బాలకృష్ణ తెలిపారు.

చదవండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. ఆ పోలీసులకు రివార్డు!

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. ఘటనా స్థలం వద్ద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు ఆయుధాలు లాక్కొని పారిపోయేందుకు యత్నించడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు సహా మొత్తం నలుగురు నిందితులు హతమయ్యారు. దిశ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ప్రదేశానికి అత్యంత సమీపంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
 

చదవండి:

దిశ నిందితుల ఎన్కౌంటర్

దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

సినిమా

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి