నాన్నగారు తీయలేని సినిమా నేను తీస్తా!

25 Jan, 2018 19:59 IST|Sakshi

 రామానుజాచార్యుల వారి చరిత్ర భక్తులకు తెలియచేస్తానటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

తాడేపల్లి : సినీరంగంలో తన తండ్రి  ఎన్టీ రామారావు తీరని కోరిక అయిన రామానుజాచార్య చరిత్రను తాను సినిమాగా చిత్రీకరిస్తానని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో ఆయన గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాల మధ్య ఆయనకు పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ‘రామానుజాచార్య చరిత్రను నాన్నగారు సినిమాగా తీయాలనుకున్నాయి. అయితే అది కార్యారూపం దాల్చలేదు. ఆయన తీరని కోరినను నేను తీరుస్తా.  ప్రపంచంలోని అతి గొప్ప వ్యక్తి అయిన రామానుజాచార్యుల చరిత్రను సినిమాగా రూపొందించి ప్రజలకు ఆయన గొప్పతనాన్ని తెలియచేస్తా’ అని అన్నారు.

మరిన్ని వార్తలు