డై..లాగి కొడితే....

20 Oct, 2016 23:13 IST|Sakshi
డై..లాగి కొడితే....

 సినిమా : నరసింహనాయుడు
 రచయితలు: పరుచూరి బ్రదర్స్
 దర్శకత్వం: బి.గోపాల్


 నూతన దంపతులు నరసింహ నాయుడు (బాలకృష్ణ), శ్రావణి (సిమ్రాన్) గుడిలో ప్రదక్షిణలు చేస్తుంటారు. మీ బావ అప్పల నాయుడును (మోహన్‌రాజ్) చంపింది వాడేరా తమ్ముడూ అంటూ కుప్పుస్వామి నాయుడుకి (ముఖేష్ రిషి) చూపిస్తుంది అతని సోదరి (తెలంగాణ శకుంతల). ‘నా బావను చంపినవాడి చావు చూసే దాకా నిద్రపోను’ అని నరసింహతో తలపడతాడు కుప్పుస్వామి. ఇలా చెయ్యి కలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడని నరసింహ అంటాడు. గుడైపోయిందిరా లేక పోతే.. అని కుప్పుస్వామి అంటా డు. పోనీ, నీ ఊరి నడిబొడ్డులో చూసుకుందామా? ప్లేసు నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే. టైమ్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే..
 
 ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా’
 అని కుప్పుస్వామికి వార్నింగ్ ఇస్తాడు నరసింహనాయుడు. ఏ టైమ్‌లో రాశారో కానీ సినిమా విడుదలై పదిహేనేళ్లవుతున్నా ఈ టైమ్‌లోనూ ఈ డైలాగ్ ఆ నోటా ఈ నోటా వినపడుతూనే ఉంది.